Siblings Threw Car Into Canal : తండ్రిపై కోపమా? మతిస్థిమితం లేకపోవడమే కారణమా? | Nalgonda | ABP Desam

Nalgonda జిల్లాలో Sagar Canal వద్దకు నిన్న అనుమానాస్పదంగా ఓ కారు కొట్టుకొచ్చింది. అయితే ఆ కారును కావాలని అక్కా, తమ్ముళ్లు కాల్వలోకి తోసేసినట్లు గుర్తించారు పోలీసులు. మతిస్థిమితం లేని కారణంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ అదే జిల్లా తిప్పర్తికి చెందిన రామాంజనేయులు పిల్లలు. గత కొంతకాలంగా తనతో విభేదాలు ఉండటం వల్ల తనకి దూరంగా ఉంటున్నారని ఆంజనేయులు తెలిపారు. అయితే తాను ఇంటివద్ద పార్కింగ్ చేసిన కారు పోయిందంటూ మిర్యాలగూడలో ఫిర్యాదు చేశారు. అక్కడ మిస్సయిన కారు... ఇప్పుడు సాగర్ కెనాల్ లో దొరికిందని పోలీసులు ఫిక్స్ అయ్యారు. అయితే వాళ్లెందుకు ఇలా చేసారు అన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola