KCR Important Decisions | Erravalli Farm House సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న CM KCR| ABP Desam
Erravalli లోని Farm House లో మంత్రులు, అధికారులతో CM KCR సమావేశం ముగిసింది. వివిధ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ లో TRS పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని KCR నిర్ణయించారు. కింద స్థాయి నుంచి పైదాకా ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. Telangana లో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో ఆందోళనకు ఈ భేటీలో రూపకల్పన చేయనున్నారు. సమావేశం తర్వాత అదే రోజు కొందరు మంత్రులతో కలిసి KCR దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. Punjab లో 100 శాతం వరి కేంద్రం సేకరిస్తున్నందున , తెలంగాణలోనూ అలానే చేయాలని డిమాండ్ చేయబోతున్నారు.