MP Raghunandan About Cow Salughtering | Medak Clashes | గోవధపై MP రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు | ABP

Continues below advertisement

MP Raghunandan About Cow Salughtering | Medak Clashes | గోవధను అడ్డుకోవాల్సిన పోలీసులే... గోరక్షకులను అరెస్ట్ చేసి హింసిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ముస్లింలను కాకుండా కేవలం హిందువులనే అరెస్ట్ చేస్తున్నారంటూ ఎస్పీని విమర్శిస్తున్నారు.

 

మెదక్ పట్టణంలో జూన్ 15న రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆవులను రవాణా చేస్తుంటే భారతీయ జనతా యువమోర్చా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలిపారు. దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలలో పలువురికి గాయలు కాగా, అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద ఆవులు కనిపించడంతో బక్రీద్ సందర్భంగా గోవధ చేసేందుకు తరలిస్తున్నారని వాదన మొదలైంది.

మరోచోట సైతం ఆవులు ఉన్నాయన్న సమాచారం మేరకు సీఐతో కలిసి అక్కడికి వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడిచేయడం కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం ఇది ఇరు వర్గాల దాడికి దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, దాడులు చేసుకుంటున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.  మెదక్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణలకు పోలీసులే కారణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గోవధను అడ్డుకున్నందుకు గోరక్షక్, బీజేపీ కార్యకర్తలపై మరోవర్గం దాడి చేయటం, పోలీసులు తమ మీదే కేసులు పెట్టడం దారుణమంటూ మండిపడ్డారు రాజాసింగ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram