Harish Rao About Chandrababu Naidu | ఏపీలో పింఛన్ల పెంపుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు | ABP Desam

Harish Rao About Chandrababu Naidu | ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారని... తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోతున్నా పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 6 నెలల బకాయిలతో కలిపి..వచ్చే నెల నుంచైనా వృద్ధుల పింఛన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

 

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు... నేరుగా పోలవరం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్నేళ్లుగా సాగుతున్న పనుల గుర్తించి అడిగి తెలుసుకున్నారు. 

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు.. నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి సోమవారం పోలవారంగా మార్చాలని ఎప్పటికప్పుడు అప్‌డేట్ తనకు ఇవ్వాలని సూచించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola