MLC Kavitha Sensational Comments | హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావులకు భాగం ఉందంటూ పెద్ద బాంబే పేల్చారు కవిత. కేసీఆర్ దేవుడని..అలాంటి వ్యక్తి పైన సీబీఐ ఎంక్వైరీ వేయటం దారుణం అంటూ తొలిసారి తనపై పార్టీలో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల పేర్లు బయటపెట్టారు కవిత. భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ పై కొంత మంది కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై ఆరోపణలు రావడానికి ఇద్దరు, ముగ్గురు నేతలే కీలకమన్నారు. వారిలో హరీష్ రావు ముఖ్యవ్యక్తి అని ఆరోపించారు. సంతోష్ రావు కూడా ఉన్నారన్నారు. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ కవిత కంటతడి పెట్టారు. ముగ్గురి వల్ల తన తండ్రిపై మరకలు పడుతున్నాయన్నారు. మా నాన్న పరువు పోతే నాకు బాధ ఉండదా అని ఆవేదన వ్యక్తం చేశారు.