KTR on Kaleshwaram case | రెండు రోజుల ధర్నాలకి పిలుపునిచ్చిన కేటీఆర్

‘కాళేశ్వరం’ కేసును సీబీఐకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రెండు రోజుల పాటు ఆందోళనలకి దిగాలని పిలుపునిచ్చారు. దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్పెషల్ టెలి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించికి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి.. నదీ జలాలను ఆంధ్రాకు తరలించాలని రేవంత్ కుట్రలు చేస్తున్నారని, ఇదంతా బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. నిన్నటి దాకా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చారని.. దాని వెనకున్న శక్తులు, వాటి ఉద్దేశం ఏంటో ప్రజలకి తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకి నిర్దేశించారు. కేసులు, అరెస్ట్‌లు బీఆర్ఎస్‌కి కొత్త కాదని.. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఎంతటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. ఇక కేటీఆరే స్వయంగా పిలుపునివ్వడంతో మండల, జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే కేటీఆర్ ఇదే విషయంపై చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. ‘రాహుల్ గాంధీ, మీకు మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా? కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారు. ఏ సీబీఐనైతే బీజేపీ 'ప్రతిపక్షాల నిర్మూలన సెల్' అన్నారో అదే సీబీఐకి అప్పగించారు. అయితే ఎలాంటి కుట్రలు చేసినా న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతూనే ఉంటాం. న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే ఈ ట్వీట్‌కి రాహుల్ గాంధ 2024లో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ని కూడా ట్యాగ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola