MLC Kavitha ED Investigation : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కొనసాగుతున్న కవిత విచారణ| ABP Desam
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎనిమిది గంటలుగా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. అయితే ఈడీ కార్యాలయానికి వైద్యుల బృందం రావటం..తెలంగాణ అడిషన్ ఏజీ, ఇంకా ఇద్దరు న్యాయవాదులు చేరుకోవటంతో ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.