Minister Seethakka With Jewellery | నగలతో దర్శనమిచ్చిన సీతక్క | ABP Desam

Continues below advertisement

మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన అరుదైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. సీతక్క ఒంటినిండా ఆదివాసీ నగలు, నడుముకు ఒడ్డాణం, కాళ్లకు కంకణాలతో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రత్యేక రూపం వెనుక కారణం ఆదిలాబాద్‌లో జరిగే జంగూ భాయ్ జాతర. ఆదివాసీలు ఆడంబరంగా నిర్వహించే ఈ వేడుక కోసం సీతక్క పూర్తిగా ఆదివాసీ వేషధారణలో పాల్గొన్నారు.

సీతక్క సాధారణంగా ఎంతో సింపుల్‌గా కనిపించే వ్యక్తి. కానీ జంగూ భాయ్ జాతర కోసం సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె తన భిన్న రూపంలో భక్తుల ముందుకు రావడం విశేషం. ఈ ఉత్సవంలో భాగంగా ఆమె కంకణాలు, గొలుసులు, ఇతర సంప్రదాయ నగలతో నిండుగా అలంకరించుకుని జాతరలో పాల్గొన్నారు. ఆదివాసీ ఆచారాలను అనుసరిస్తూ పూజలు చేయడం ఆమె వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని చేర్చింది.

జంగూ భాయ్ జాతర ఆదిలాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్సవం. ఈ వేడుకలో ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సీతక్క ఆ సంప్రదాయాలను గౌరవించి పాల్గొనటమే కాకుండా, ఆదివాసీ జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రజలతో మమేకమై వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న సీతక్క, ఆదివాసీ సంప్రదాయాలకు తన మద్దతు తెలియజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola