China Manja in Hyderabad | నిబంధనలు డోంట్ కేర్.. హైదరాబాద్ లో యథేచ్చగా మాంజా అమ్మకాలు | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లో కైట్స్ అమ్మకాలంటే ధూల్ పేట్. ఇక్కడ కైట్స్ దుకాణాల సందడి చూడింది. ఎంత రద్దీగా కనిపిస్తున్నాయో. రెండు రూపాయల నుండి రెండువేల రూపాయల వరకూ ఇక్కడ కైట్స్ అందుబాటులో ఉంటాయి. వందల్లో రకాలు, రోజూ వేలల్లో వినియోగదారులు వివిధ జిల్లాల నుండి సైతం ఈ ధూల్ పేట్ కైట్ మార్కెట్  వచ్చి బల్క్ లో కైట్స్ కొంటుంటారు.పగలు,రాత్రి తేడా లేదు. ఎనీ టైమ్ సంక్రాంతి వచ్చిందంటే ధూల్ పేట్ ధూమ్ ధామ్. బయట వందరూపాయలు ఉంటే కైట్ ఇక్కడ కేవలం ఇరవై రూపాయలకే దొరుకుతుంది. అందుకే ఇక్కడ డజన్ లలో మాత్రమే సేల్స్ అందుబాటులో ఉంటాయి. కుటుంబ సమేతంగా కైట్స్ సంబరాలు జరుపుకునేవారికి ధూల్ పేట ఈ కైట్స్ మార్కెట్ లో తప్ప మరెక్కడా ఇంతలా రంగు రంగుల డిజైన్స్,  సైజులు, వినూత్న ఆకారాల్లో కైట్స్ దొరకవంటే ,దొరకవు. ఇప్పుడు మీరు చూస్తుందంతా ధూల్ పేట్ లో నాణ్యానికి ఒకవైపే. మరో వైపు ఇక్కడ గుట్టుచప్పుుడు కాకుండా జరిగే మాంజా అమ్మకాలు ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాయి. పీకలు తెగిపడుతున్నాయి. వందలాది పక్షులు మాంజా తగిలి గాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. నిబంధనలు ఉన్నా వీళ్లకు డోంట్ కేర్. చట్టాలు కేసులు వీరికి లెక్కలేదు. ఏబిపి ఫ్యాక్ట్ చెక్ లో ఇక్కడ మాంజా అమ్మకాలు ఇలా అడ్డంగా దొరికిపోయాయి.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola