Harish Rao: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీశ్ రావు
Continues below advertisement
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. భార్యాభర్తలు, పిల్లలతో వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ఖాజీపూర్ రహదారిపై చెట్టును ఢీకొట్టింది. కుటుంబ సభ్యులు మొత్తం గాయపడ్డారు. మంగళవారం ఉదయం అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాల్ చేసి వెంటనే అంబులెన్సును రప్పించారు. ఆ కుటుంబాన్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి పంపించారు. మంత్రి హరీశ్ రావుకు ఆ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు మంత్రి హరీశ్ రావు సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Continues below advertisement