Medaram Full of Garbage | చెత్తా చెదారంతో నిండిపోయిన మేడారం | ABP Desam
మేడారంలో దాదాపు 5 వేలమంది పారిశుధ్య కార్మికులను విధుల్లో ఉంచామని, ఎప్పటికప్పుడు ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, చెత్త, చెదారం... వంటి వాటిని శుభ్రం చేసి, డంపింగ్ యార్డులకు తరలిస్తున్నామని జాతర ముందు అధికారులు చెప్పారు. పక్కా ప్రణాళికతో సాగుతున్నామని ఏబీపీ దేశానికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరి జాతర ముగిసి ఐదు రోజులైంది. ఇప్పుడు మేడారం జాతర జరిగిన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఓసారి మీరూ చూడండి.