అక్కడ భూమి నుంచి బయటకు వచ్చే నీరు వేడిగా ఉంటుందట.. ఎందుకో తెలుసా?

Continues below advertisement

అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం. అక్కడ  మోటార్లు లేవు , విద్యుత్  కనెక్షన్ కూడా లేదు. కానీ అక్కడి ప్రజలకి మాత్రం భూగర్భం నుండి వేడి నీటి సరఫరా ఉంది. సాధారణంగా ఎక్కడైనా భూగర్భ నీరు చల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గంగ వేడి నీటి రూపంలో ఊబికివస్తుంది . గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ గ్రామాల్లో 25 ఏళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడ డ్రిల్లింగ్ చేయగా వేడి నీటి ఊటలు బయటపడ్డాయి. ఈ నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండటం విశేషం. ఈ గ్రామంలో సాధారణంగా 100 నుంచి 200 అడుగులలోపు సాధారణ నీరు వస్తుంది అని..  బొగ్గు నిక్షేపాల కోసం జియోలాజికల్ అధికారులు 1000 నుంచి 1200 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేయడం తో వేడి నీరు వస్తుంది అని చెప్పారు . ఈ ప్రాంతం లో వచ్చే వేడి నీటి ఊటలను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram