Manneguda Kidnap | Naveen Reddy Mother: నిన్నటికి ముందు చాలా జరిగిందన్న నవీన్ తల్లి
మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తల్లిదండ్రులు రాగన్నగూడలో నివాసముంటున్నారు. నిన్న జరిగిన ఘటన పొరపాటేనని, కానీ అంతకముందు చాలా జరిగిందని అతని తల్లి నారాయణమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. కాసేపటికే ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.