Pragathi Bhavan : మంచిర్యాల మహేష్ ఆత్మహత్యకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
మంచిర్యాలలో మహేష్ అనే యువకుడి ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రగతి భవన్ పై మెరుపు దాడికి యత్నించిన నాయకులు పరుగున వచ్చి ప్రగతిభవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అధికారులు స్పందించకపోగా...ప్రభుత్వం పెట్టుబడులు తెస్తామని చెప్పుకుంటోందంటూ మండిపడ్డారు.