Mahabubabad Accident: బండరాళ్లు పడి ఆటోలోని నలుగురు దుర్మరణం
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోపై.... పక్కనే ఉన్న గ్రానైట్ లారీలోని బండరాళ్లు మీదపడ్డాయి. ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బండరాళ్లను తొలగించారు. లారీ లోడ్ కి కట్టిన తాళ్లు తెగిపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.