మోడీ క్యాబినెట్‌లోకి మాధవీలత ఎంట్రీ ఎప్పుడంటే..!? | ABP దేశంతో మాధవీలత Exclusive ఇంటర్వ్యూ

Continues below advertisement

తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత. ఏకంగా అసదుద్దీన్ ఒవైసీకే ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఆమె పేరు ప్రకటించక ముందు నుంచే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక హైకమాండ్ ఆమెకి టికెట్ ఇచ్చాక ఆ పాపులారిటీ మరింత పెరిగింది. సోషల్ మీడియాలోనూ బోలెడంత మంది (BJP Candidate Madhavi Latha) ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూలూ బాగానే పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. "నేను మహిళనే కాదు" అని మాధవీ లత చెప్పినట్టుగా ఉన్న వీడియో (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) విపరీతంగా షేర్ అవుతోంది. చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అయితే...ఇందులో నిజం ఎంత అని ఫ్యాక్ట్ చేయగా...అది ఫేక్ అని తేలింది. ఓ వీడియోని క్రాప్ చేసి అలా ట్రోల్ చేసేందుకు ఎడిట్ చేసినట్టు వెల్లడైంది. ఇంతకీ ఆమె చెప్పిందని ఆరా తీస్తే "నేను మహిళను కాదు. శక్తి స్వరూపాన్ని" అని చెప్పుకున్నారు. కానీ..అందులో శక్తి స్వరూపాన్ని అనే మాటని ఎడిట్ చేసి కేవలం "నేను మహిళను కాదు" అనే క్లిప్‌ని మాత్రమే పోస్ట్ చేశారు. దాన్నే వైరల్ చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram