KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP Desam
కేటీఆర్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ఫార్మూలా ఈ రేసుకు సంబంధించిన తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా కేటీఆర్ హైకోర్టులో పెట్టుకున్న పిటీషన్ ను ధర్మాసనం కొట్టేసింది. విదేశీ సంస్థలకు నిధుల తరలింపు విషయంలో కేటీఆర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు పెట్టగా...ఆ కేసులను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తరపున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈరోజుకు తీర్పు రిజర్వ్ చేయగా ఇవాళ న్యాయమూర్తి తీర్పు చదివి వినిపించారు. ఇలాంటి కేసులో క్వాష్ కుదరదన్న హైకోర్టు... విచారణ కు హాజరవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులకు సూచించారు. ఇవాళ్టి తీర్పుతో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఉన్న ఉత్తర్వులు కూడా ముగిసి పోనుండటంతో ఏసీబీ, ఈడీ ఏం చేస్తాయనేది చూడాలి. నిన్న ఏసీబీ విచారణ కోసం వెళ్లిన కేటీఆర్..తన న్యాయవాదులను అనుమతించకపోవటంతో ఎంక్వైరీకి హాజరుకాకుండానే వెనక్కి వచ్చేశారు. ఈడీ విచారణకు ఈరోజు హాజరు కావాల్సి ఉండగా...కోర్టు తీర్పు ఈ రోజు రిజర్వ్ లో ఉన్నదనే కారణంతో వేరే డేట్ అడిగారు. ఏసీబీ 9వ తారీఖు విచారణకు హాజరు కావాలని నిన్ననే మరో డేట్ ఇచ్చింది. సో కోర్టు తీర్పును బట్టి కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరు కావాల్సి ఉంటుంది. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది.