Charlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam
ఏదో ఎయిర్ పోర్ట్ ను చూసిన ఫీలింగ్ కలుగుతోంది చర్లపల్లి లో కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ చూస్తుంటే. ప్రధాని మోదీ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ స్టేషన్ ను అత్యాధునిక హంగులతో ఏకంగా 430కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించారు. సికింద్రాబాద్, కాచి గూడ, నాంపల్లి లాగానే చర్లపల్లి స్టేషన్ కూడా టెర్మినల్ స్టేషన్ గా పనిచేయనుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్ గా బయలుదేరేలా ఈ స్టేషన్ కు ప్రత్యేకంగా కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను కేటాయించనున్నారు. రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణాలు జరిపేలా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎస్కలేటర్లు లిఫ్టులు, ఏసి లౌంజ్ లు, డిజిటల్ టికెట్ కౌంటర్లు, ఫుడ్ కోర్టులు, రైలు సమాచారం చెప్పేందుకు డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఇలా ఒకటేంటి చూస్తుంటే ఏదో ఎయిర్ పోర్ట్ లో తిరుగుతన్నంత ఫీలింగ్ ఉంది చర్లపల్లి రైల్వే స్టేషన్ లో.