
KTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam
టీ షాపునకు కేటీఆర్ ఫోటో పెట్టుకోవటంతో తన షాపు మూసేయమంటున్నారంటూ సిరిసిల్లలో ఓ చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా ఓ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దానికి కేటీఆర్ టీ షాప్ అని పేరు పెట్టుకోవటంతో పాటు కేటీఆర్ ఫోటోను కూడా షాపుకు ఫ్లెక్సీలా పెట్టుకున్నాడు. అయితే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేటీఆర్ టీ షాపును చూసి అతను ఫుట్ పాత్ ను ఆక్రమించి షాప్ పెట్టాడని దానికి ట్రేడ్ లైసెన్స్ చెక్ చేయాలని లేదంటే షాప్ మూసివేయాలని అధికారులను ఆదేశించారట. దీంతో తన షాపు వద్దకు ఇద్దరు మున్సిపల్ అధికారులు వచ్చి మూసేయాలంటున్నారంటూ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనది చిన్న వ్యాపారమే అని ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అంటే తీసుకుంటానని షాపు మూసేయమంటే కష్టమని అధికారులకు విన్నవించుకున్నాడు. అయితే కేటీఆర్ ఫోటో ఉండటమే మీకు అభ్యంతరమా అంటూ కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్ కు మద్దతుగా వచ్చి అధికారులను నిలదీశారు. కేటీఆర్ ఫోటో న్యూస్ పేపర్ తో తొలుత కవర్ చేసిన శ్రీనివాస్ అప్పటి అధికారులు వెళ్లకపోవటంతో కేటీఆర్ ఫోటోను తొలగించాడు.ఈ వీడియో వైరల్ కావటంతో స్పందించిన కేటీఆర్...ప్రతీదీ చూస్తున్నానని అన్నీ గమనిస్తున్నానని టీ వ్యాపారికి తను అండగా ఉంటానన్నారు కేటీఆర్.