
KCR Second Innings Start | బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం పెట్టిన కేసీఆర్ | ABPDesam
అనారోగ్యం, హిప్ ఆపరేషన్స్ కారణంగా దాదాపు ఏడాది కాలంగా రాజకీయాలకు అంటీ ముట్టన్నట్లుగా ఉన్న కేసీఆర్ తన 2.0 ను మొదలు పెట్టేశారు. ఈ రోజు పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లిన కేసీఆర్ తన డిప్లమోట్ పాస్ పోర్ట్ ను సబ్మిట్ చేసి సిటిజన్ పాస్ పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్..కార్యకర్తల కోలాహలం మధ్య పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలందరినీ నవ్వుతూ పలకరిస్తూ అందరికీ మనోధైర్యం ఇచ్చేందుకు కేసీఆర్ యత్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా హాజరైన ఈ కార్యక్రమం తర్వాత కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనే విషయంపైన ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొని ఉంది. కేసీఆర్ రాకతో సీఎం రేవంత్ రెడ్డికి ఇక పొలిటికల్ హీట్ షురూ అవుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలైతే ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కేసీఆర్ వచ్చిండు కాబట్టి తమ పార్టీ కు ఇంక తిరుగులేదనే ఆనందంలో ఉన్నారు..