KTR ACB Investigation | ఏసీబీ విచారణకు కేటీఆర్ | ABP Desam
ఫార్ములా - ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఇవాళ మరోసారి విచారణ చేస్తుంది ఏసీబీ. మే28వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. కానీ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని .. తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఏసీబీని కోరారు.
విచారణ నేపథ్యంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గౌరవం ఉంది కాబట్టే 3వ సారి విచారణకు పిలిచినా వస్తున్నామని అన్నారు. తనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్. తెలంగాణ కోసం గతంలోనే జైలుకి వెళ్ళొచ్చామని... 100 సార్లు జైలుకు వెళ్లినా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం అని అన్నారు కేటీఆర్.