Harish Rao Hospitalized | ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి హరీశ్ రావు | ABP Desam

 తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణ పూర్తయ్యే వరకూ బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్న హరీశ్...కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు కూడా. కేటీఆర్ ప్రసంగం సమయంలో హరీశ్ బాధపడుతున్నట్లుగా విజువల్స్ లో తెలుస్తోంది. అయితే ఆయన్ను వెంటనే బేగంపేట్ సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. తెలంగాణ భవన్ లో ప్రెస్  మీట్ కు ముందు సెలైన్ ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ హరీశ్ ను పరామర్శించారు. రెండురోజులుగా హరీశ్ రావు తీవ్ర మైన జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారని అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కేటీఆర్ విచారణకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకూ పార్టీ ఆఫీసులోనే ఉన్న హరీశ్ రావు కేటీఆర్ కంటే ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు కూడా. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola