Telangana: రూ.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా.. గిదేంది మరి?: కొండా

ఎప్పటికప్పుడు తనదైనశైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేసే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లి గ్రామంలో కట్టెల వంతెన సమస్యపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెళ్లేందుకు దారిలేక రైతులే కట్టెల వంతెన నిర్మించుకున్నారని తెలిపారు. మంత్రి అయినా అయిదేళ్లు దాటిపోతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ సెటైర్ వేశారు.  మౌలిక సదుపాయాలకు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన ప్రభుత్వం.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేసిందని, నిధులు ఎటు పోయాయంటూ వీడియో ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola