Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

Continues below advertisement

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కూతురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తల్లి, మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ (TPCC) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో గాంధీ భవన్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా సుస్మిత మాట్లాడారా? లేక పార్టీలోని అంతర్గత నిజాలను బయటపెట్టినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? కాంగ్రెస్ మహిళా నేతలు కొండా సుస్మితను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సొంత పార్టీ నాయకులే హెచ్చరికలు జారీ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు?

ఈ వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాతతో ABP దేశం ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పరిణామాలు, ఈ వివాదం వెనుకున్న అసలు నిజాలను కల్వ సుజాత ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola