Komaram Bheem Project : కడెం ప్రాజెక్ట్ భయం వదలక ముందే ఇప్పుడు కుమ్రం భీం | ABP Desam

Continues below advertisement

ఇటీవలి వర్షాలకు కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. దీంతో వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట చివరి భాగం దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకు పోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్ల మెల్లగా కూలిపోతోంది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు. కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇన్ ఫ్లో ఎంతో...అవుట్ ఫ్లో ఎంతో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరీ దారుణం ఏమిటంటే ప్రాజెక్టు కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో ఏడాది కిందట కనెక్షన్ తొలగించారు. ఇటీవలి కడెం ప్రాజెక్టు అనుభవం తర్వాత కూడా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram