Kishan Reddy: రామప్ప ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
ములుగు జిల్లాలో పర్యటిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదాశీర్వదాలు తీసుకున్న అనంతరం గట్టమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన హరిత గ్రాండ్ హోటల్ కాటేజ్ లు ప్రారంభించారు. కిషన్ రెడ్డితోపాటు తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags :
Telangana Ramappa Temple Kishan Reddy Kishan Reddy Visits Ramappa Temple Ramappa Temple In Warangal