Khanapur MLA Rekha Naik : నిర్మల్ జిల్లా కడెం జిల్లా పల్లెల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ | ABP Desam

Continues below advertisement

వాగులో తెప్ప పై.. బురదలో ఎడ్లబండి పై ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్. కడెం మండలంలోని మారుమూల గ్రామాలైన గంగాపూర్, రామిగూడా, కొర్రతండా లతో పాటు సుమారు తొమ్మిది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సుమారు 20 రోజుల నుండి కనీస రోడ్డు సౌకర్యం లేకుండా ఇబ్బందులకు గురవుతున్న గ్రామాలను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం వంతెన లేని ఆ ప్రాంతాలను చూసేందుకు రేఖానాయక్ చాలా రిస్క్ చేసి వెళ్లారు. సీఎం కేసీఆర్ దృష్టికి ముంపు గ్రామ ప్రజల సమస్యలను తీసుకు వెళ్తామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram