Khammam Floods | Tummala Nageswara Rao | కాపాడే వరకు పోనివ్వమంటూ మంత్రి తుమ్మల ముందు జనాల ధర్నా |

Continues below advertisement

Khammam Floods | Tummala Nageswara Rao | ఖమ్మం పట్టణంలో ప్రకాష్ నగర్ వద్ద చిక్కుకున్న 9 మందిని రక్షించడంలో సర్కార్ నిర్లక్షంగా వ్యవహరిస్తోందని స్థానికులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తిరగబడ్డారు. ప్రకాష్ నగర్ లో సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చిన మంత్రి తుమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాపాడే వరకు ఇక్కడి నుంచి పంపించేది లేదని నిరసన వ్కక్తం చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో వాగులు , వంకలు పొంగి పోర్లుతున్నాయి. అత్యవసరమైతే  తప్పా ఇళ్ల నుంచి బయటికి రాకపోవడమే ఉత్తమమమని అధికారులు సూచిస్తున్నారు.

 

ఇది ఇలా ఉంటే ఖమ్మం నగరంలో జరుగుతున్న సహాయక చర్యలు పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , ఖమ్మ జిల్లా మంత్రులు వెళ్లనున్నారని సమాచరం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram