Khammam Floods | Munneru Vaagu Heavy Flow | ఖమ్మంలో బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది.. టెన్షన్ టెన్షన్

Khammam Floods | Munneru Vaagu Heavy Flow | చూడండి... చుట్టు ఉద్ధృతంగా ప్రహహిస్తున్న మున్నేరు..!  మధ్యలో చిక్కుకున్న 9 మంది..! ఈ 9 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటికి తీసుకువచ్చాయి. ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయమే 9 మంది చిక్కుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వారిని రక్షించేందుకు ఎవరు సాహసించలేదు. ప్రభుత్వ వర్గాలు కూడా వీరిని రక్షించడంలో అలసత్వం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే... రాత్రి 10 గంటల తరువాత వరద ఉద్ధృతి కాస్త తగ్గడంతో... ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ సాయంలో వారిని రక్షించారు. దాదాపు 12 గంటలు పాటు వారు అక్కడే చావు భయంలో బిక్కు బిక్కుమంటు ఉన్నారు. చివరికి వారిని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మరోవైపు.. ఖమ్మం లో ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు అక్కడికి చేరుకోనున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రానున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola