ఖమ్మం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారిన లకారం కేబుల్ బ్రిడ్జి నిర్మాణం
ఖమ్మం నగరం సరికొత్త అందాలతో రోజురోజుకు శోభాయమానంగా మారుతోంది. పెద్ద నగరాలకు దీటుగా సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు నూతనంగా ఆవిర్భవించాయి. తాజాగా లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం నగరానికి మరింత అందాన్ని తెచ్చింది. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించిన ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని లకారం చెరువుకే సరికొత్త సొగసులు అద్దింది . ఈ బ్రిడ్జి పర్యాటకులకు వింత అనుభూతిని ఇవ్వనుంది. కొన్ని ప్రాంతాల్లోనే ఉన్న ఇలాంటి సస్పెన్షన్ బ్రిడ్జి నగర వాసులకు అందుబాటులోకి రానుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది