KCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desam

Continues below advertisement

  తననే నమ్మితో..తనతో ఎంతో కాలంగా ఉంటూ...తన వ్యవహారాలు పార్టీ వ్యవహారాలు చూసుకున్న ఓ పెద్దాయనకు కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఓ రకంగా ఆయనకు బాధ్యతల విరమణ కల్పిస్తూ అమెరికాకు ప్రయాణమవ్వమని చెప్పి  దగ్గరుండి వీడ్కోలు పలికారు. ఈ పెద్దాయన పేరు మాదిరెడ్డి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ కి జనరల్ సెక్రటరీ.అండ్ తెలంగాణ భవన్ కు ఆయనే ఇన్ ఛార్జి కూడా. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని దాని బాధ్యతలను చూసుకున్నారు మాదిరెడ్డి శ్రీనివాస్. ఆయనకిప్పుడు 85ఏళ్లు నిండాయి. వయసు రీత్యా తమ తల్లితండ్రులు తమతో పాటు అమెరికాకు వచ్చేయాలంటూ మాదిరెడ్డి శ్రీనివాస్ వారసులు కోరుతున్న కోరిక మేరకు ఆయన్ను అన్ని బాధ్యతల నుంచి తప్పించారు కేసీఆర్. శ్రీనివాస్ దంపతులను వారి పిల్లలను ఇంటికి పిలిచి భోజనం పెట్టి...బంగారు లాకెట్ మెడలో వేసి శాలువతో సన్మానించారు. ఆ లాకెట్ మీద విత్ లవ్ కేసీఆర్ అని రాశారు. ఇక రాజకీయాలు ఆలోచించొద్దని...శేష జీవితం ప్రశాంతంగా కుటుంబసభ్యులతో గడపాలని తన హితుడికి అన్ని మంచి చెడ్డలు చెప్పి కారు వరకూ వెళ్లి సాగనంపారు కేసీఆర్. అధినేత ఆత్మీయతకు ఆయన ప్రేమకు మురిసిపోయారు మాదిరెడ్డి శ్రీనివాస్. తెలంగాణను విడిచి పెట్టాలని లేకున్నా...పిల్లల కోసం వెళ్తున్నామని చెబుతూ కేసీఆర్ నుంచి సెలవు తీసుకున్నారు శ్రీనివాస్. తనను నమ్మినోళ్లకు తనతో ఉన్నోళ్లకు కేసీఆర్ సారు ఇచ్చే గౌరవం ఈ స్థాయిలో ఉంటుంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram