Singareni: బొగ్గు గనుల చరిత్రలో అతి పెద్ద విషాదమిదే
సింగరేణి కాలరీస్ శ్రీరాంపూర్ లో పైకప్పు కూలటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఇలాంటి ఎన్నో ఘోర విషాదాలను చూసింది సింగరేణి కాలరీస్. 73ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘోర విషాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు 43 మంది ఒకే సారి మృత్యువాతపడ్డారు. పొట్ట కూటి కోసం వలస వచ్చి బొగ్గు బావిలోకి దిగిన కార్మికులు ఒకసారిగా పై కప్పు కూలిపోవడంతో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. పీరీల పండుగ రోజున జరిగిన ఈ విషాద ఘటన నేటికి సింగరేణి వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంటుంది.