
గొప్ప చదువులు చదివాడు... మంచి కంపెనీలో ఉద్యోగాలు చేశాడు.. బుద్ది వంకరతో జైలుపాలయ్యాడు
Continues below advertisement
విరాట్ కోహ్లీ, ఆయన కుమార్తెపై అసభ్యకర ట్వీట్లు, బెదిరింపులు చేసినందుకు గానూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్టయ్యాడు. ఇతను భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్‌లో బెదిరించాడు. దీంతో యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్టు చేశారు. నిందితుడు 23 ఏళ్ల రామ్ నగేష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతను హైదరాబాద్‌లోని ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌కు చెందిన సంస్థలో ఉన్నత స్థానంలో పనిచేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకున్నందుకు ఫరాన్ అక్తర్, మరికొంతమంది ప్రముఖులు పోలీస్ ను అభినందించారు.
Continues below advertisement