నా కుమారుడి మృతిపై అనుమానాలున్నాయి....ఎవరూ పట్టించుకోవటం లేదు..!
తనకు ఆసరాగా ఉన్న ఒకే ఒక్క కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినా ఎవరూ పట్టించుకోవటం లేదని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతే కాదు ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతి ఇవ్వడంటూ కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చింది ఆండాళ్లమ్మ. జర్నలిస్టుగా పనిచేస్తున్న తన కుమారుడు అకస్మాత్తుగా ప్రమాదంలో మరణించాడని చెప్పారని...అయితే అతని ఫోనులో ఉన్న డేటా అంతా మాయమైందని...పోలీసులను ఆశ్రయించినా.....న్యాయం జరగటం లేదని కన్నీటిపర్యంతమవుతోంది ఆండాళ్లమ్మ.