టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉద్రిక్తత
టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచీ రేవంత్ నివాసంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. సోమవారం తెల్లవారుజామునుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేశారు. రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tags :
Revanth Reddy TPCC Chief Revanth Reddy Revanth Reddy Arrest Malkajgiri Mp Revanth Reddy Revanth Reddy Arrest In Hyderabad Congress Leader Revanth Reddy