Huzurabad By Elections: బీజేపీపై మాజీ ఎంపీ వినోద్ సంచలన వ్యాఖ్యలు
Continues below advertisement
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ వినోద్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలోనే అద్భుతంగా సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ కు ఓటెయ్యకుండా అరాచకాలు సృష్టించే బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారని మాజీ ఎంపీ వినోద్ ప్రశ్నించారు. కేసీఆర్ సభను కేంద్రంలోని బీజేపీనే రద్దు చేయించిందని ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే కేంద్ర బలగాలను ఎందుకు పంపించారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అభివృద్ధి కోరుకునే ప్రజలు టీఆర్ఎస్‌ను కచ్చితంగా గెలిపిస్తారని చెప్పారు.
Continues below advertisement