Huzurabad ByPolls: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని విస్తృత ప్రచారం
Continues below advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి, ఎలబాక, గన్ ముక్కల, మల్లన్న పల్లి, బ్రాహ్మణ పల్లి, నర్సింగా పూర్, వల్లభా పూర్ తదితర గ్రామాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేశారు.
Continues below advertisement