టీనేజర్ల వల్ల జరిగిన ఘోర ప్రమాదం తో కదిలిన అధికార యంత్రాంగం
Continues below advertisement
కరీంనగర్ లో టీనేజర్ల వల్ల జరిగిన ఘోర ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు కూడా కఠిన చర్యలకు దిగింది.మునిసిపల్ కార్పొరేషన్ బృందంతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఆక్రమణలు తొలగిస్తోంది. పట్టణ వ్యాప్తంగా ఉన్న రోడ్లపై ఉన్న అనధికార నిర్మాణాలను, స్టాళ్లను ,ఇతర తోపుడుబండ్ల ను సైతం అధికారులు స్వాధీనం చేసుకొని రోడ్లను ఖాళీ చేయించారు.వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది.
Continues below advertisement