కరీంనగర్ జిల్లా చొప్పదండి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
Continues below advertisement
కరీంనగర్ జిల్లా చొప్పదండి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది.. 45 మంది అమ్మాయిలకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ కర్రీ, గుడ్డు ,చారు మజ్జిగ తిన్న తర్వాత కడుపు నొప్పి వాంతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. 37 మంది విద్యార్థులు కోలుకున్నారు.. ఎనిమిది మంది పిల్లలకు ఇంకా వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎవరికీ ఏం ప్రమాదం లేదని ప్రిన్సిపల్ తెలిపారు. స్వాతి, చొప్పదండి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్
Continues below advertisement