Karate Kalyani on GHMC Mayor | బంజారాహిల్స్ భూవివాదంపై స్పందించిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి

బంజారాహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం తొలగింపు వివాదం.. కొత్త మలుపు తిరిగింది. గత కొంతకాలంగా ఆలయం తరలింపుకు వ్యతిరేకంగా భక్తులు చేస్తున్న నిరసనలు.. ఇప్పుడు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మెడకు చేరాయి. భక్తులు చెబుతున్నది ఒక్కటే.. ఆలయం కోసం ప్రభుత్వమే స్ధలం కేటాయించాలనీ. కానీ అధికారులు మాత్రం.. గజం రెండు లక్షల రూపాయలు కావాలని స్పష్టంగా చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ఆరోపణను తెరపైకి తెచ్చారు సినీ నటి కరాటే కళ్యాణి. కేవలం రెండేళ్ల క్రితం ఇదే భూమిని.. గజం 350 రూపాయలకే మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె బంధువులకు కట్టబెట్టారని ఆమె బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఏబిపి దేశం మేయర్ గద్వాల విజయలక్ష్మిని నేరుగా ప్రశ్నించింది. ఆమె సమాధానం.. భూమి తన పేరుతో ఉన్నా.. తాను కేవలం జీపిఏ హోల్డర్ మాత్రమేనని.. అసలు యజమాని కాదని. అయితే.. కోట్లు విలువ చేసే బంజారాహిల్స్ భూమిపై కళ్యాణి చేస్తున్న ఆరోపణల్లో ఎంత నిజం..? ఆమె వద్ద ఉన్న ఆధారాలేమిటి..? ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola