Sri Krishna Janmashtami Tragedy | హైదరాబాద్ శ్రీకృష్ణ శోభాయాత్రలో తీవ్ర విషాదం | ABP Desam
హైదరాబాద్ లో శ్రీకృష్ణ శోభాయాత్ర లో తీవ్ర విషాదం నెలకొంది. రామంతపూర్ లోని గోకులే నగర్ లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో వైర్లు తగిలి కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షం పడటం..పైన పక్కన కరెంటు వైర్లు ఉండటంతో ఒకరి నుంచి ఒకరి కరెంట్ సప్లై అయ్యి మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఇలాంటి విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రామంతాపూర్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.. గాయపడ్డవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. ఈ ఘటన చాలా బాధాకరం అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.