Kalvakuntla Kavitha Lawyer on Liquor Scam | లిక్కర్ కేసులో కేసీఆర్ బయటకు వచ్చిందా.? | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కాం మొత్తం కేసీఆర్‌కు తెలిసే జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కోర్టుకు చెప్పడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం సభ్యులను కేసీఆర్‌కు పరిచయం చేశారని.. ఈ సందర్భంగా లిక్కర్ వ్యాపారం గురించి వారి వద్ద నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈడీ కేసీఆర్ ప్రస్తావనను తీసుకు వచ్చింది. అయితే ఈ వార్తను కవిత తరపు న్యాయవాదులు ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటకు వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. మాగుంట రాఘవ వాంగూల్మంలో ఆయన తండ్రి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు బయటకు వచ్చిందన్న మోహిత్ రావు..దాన్ని కేసీఆర్ కు అన్వయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.