Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్

Continues below advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కో రౌండ్ లోనూ మెజార్టీ ఓట్లు సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్లో 99 ఓట్లతో నోటా నాలుగో స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ షేక్ పేట, రహమత్ నగర్, ఎర్రగడ్డలలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. రౌండ్ల వారీగా నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం సాధిస్తుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మంత్రులు, పార్టీ కీలకనేతలు గాంధీ భవన్‌కు చేరుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజా ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారని, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని ప్రజలకు చాటిచెప్పాలని అధికార కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండంగా ప్రజలు భావిస్తున్నారని చెప్పాలని గులాబీ పార్టీ చూసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola