Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 10 రౌండ్స్ లో 42 టేబుల్స్ గా కౌంటింగ్ మొదలుపెట్టగా...మొదట పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. నవంబర్ 11 న జరిగిన పోలింగ్ లో 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా...గెలుపు పై కాంగ్రెస్, BRS ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉదయం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్లి అమ్మవారి దర్శననం చేసుకున్నారు. షేక్ పేట డివిజన్ తో మొదలుపెట్టి రెండు మూడు గంటల్లోనే జూబ్లీహిల్స్ అడ్డా ఎవరిదో తేలిపోయేలా రిజల్ట్ అయితే వచ్చేయనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రస్తుతానికి వస్తున్న ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి. రెండో రౌండ్ లెక్కింపు జరుగుతోంది. ఇంకా 8 రౌండ్‌లు లెక్కింపునకు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకున్న కీలకమైన రెండు రౌండ్స్‌లో ఆధిక్యం అనుకున్నంత రాలేదు. ఇక్కడ వేలల్లో ఉంటుందని కాంగ్రెస్ భావించింది. కానీ కేవలం వందల్లోనే లీడ్ ఉండటం అధికార పార్టీ అభ్యర్థికి చెమటలు పడుతున్నాయి.