ABP News

Jeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desam

Continues below advertisement

 హైదరాబాద్ జీడీమెట్ల పోలీస్ స్టేషన్ లో పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ నగర్ లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరగటం పై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనకారులను లాగి వెహికల్స్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే….గాంధీనగర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం తలుపులు పగులగొట్టి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, నాగ పడగ, పంచలోహ విగ్రహాలు,హారతి పళ్లెంలాంటి వి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. దొంగలను అరెస్ట్ చేసినా హిందూ సంఘాలు ఆలయం ఎదుట ఆందోళనకు దిగాయి. భజరంగదళ్ ఆలయం ఎదుట నిరసనలు చేస్తుండటంతో పోలీసులు భారీ ఎత్తున  చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని లాగి వెహికల్ ఎక్కించి స్టేషన్ కు తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram