Adilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP Desam
Story Voice Over: ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ ఇది. ఈ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ) అదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1977 లో శంకుస్థాపన జరిగింది. 1982లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంగళరావ్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. మొత్తం 772 ఎకరాల భూమినీ స్తానిక రైతుల వద్ద ఎకరానికి 2 నుంచి 3 వెల రూపాయల కింద ప్రభుత్వం కోనుగోలు చేసింది. ఇక్కడ 170 ఎకరాల టౌన్షిప్, 48.18 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలతో సకల వనరులు సిమెంట్ ఉత్పత్తికి ముడి పదార్థం, సున్నపురాయి 100 సంవత్సరాలు కలిగిన సంపద ఉంది. ఈ పరిశ్రమలో 4000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమ్మకాలు చేసింది. ఈ సిమెంట్ తో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. అత్యంత నాణ్యత కలిగిన సిమెంటుగా పేరొచ్చింది. అలాంటి సిమెంట్ పరిశ్రమ కొన్నేళ్ల పాటు బాగే నడిచి..1995 లో నష్టాల కారణంగా మూతపడటం జరిగింది. అప్పటి నుంచి ఎంతో మంది ఈ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీనీ అదీ నేటికీ జరగలేదు. అలా పరిశ్రమ మొత్తం మూత పడటంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నికల వేళ ఆనేక సందర్భాల్లో ఈ సీసీఐ అంశం వేదికగా మారింది. ఎంతోమంది ప్రజా ప్రతినిధులు మా ప్రభుత్వం వస్తె పునః ప్రారంభిస్తాం.. మాకే ఒటేయ్యండి.. గెలిపించండి అంటూ నానా రాజకీయాలు చేశారు. 2018 లో కేంద్ర మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్ళీ వస్తె సీసిఐ నీ పునః ప్రారంభిస్తామన్నారు. అయినా దాని ఊసే లేదు. 2023 ఎన్నికలలోను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఆదిలాబాద్ కు వచ్చిన దాని ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందారు. అయినా కూడా ప్రజలు అదిలాబాద్ లో ఎమ్మెల్యే ఎంపి రెండు సీట్లు బీజేపీ కే పట్టం కట్టారు. ప్రస్తుతం సీసీఐ నీ తుక్కులోకీ అమ్మేసేందుకు కేంద్రం టెండరు వేసిందని, తుక్కులోకి అమ్మేస్తే మాత్రం ఊరుకోమని కార్మిక సంఘాల నేతలు, భూ నిర్వాసితులు తిరగబడుతున్నారు.