ఖమ్మంలో బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించిన డ్రైవర్

Continues below advertisement

Jcb driver rescue operation saves 9 members life from munneru floods  | పోతే నేను ఒక్కడినే... వస్తే పది మందితో తిరిగి వస్తా..!  ఇదేమి సినిమా డైలాగ్ కాదు ...కానీ అంతకు మించిన పవర్ ఉంది ఈ మాటల్లో. ఈ మాటలు ఎవరు చెప్పారంటే జేసీబీ డ్రైవర్ సుభాన్..! అసలేంటి సంగతి అంటే..! ఖమ్మంలో భారీ వర్షంతో మున్నేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. ఐతే... ఆదివారం ఉదయం ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద 9 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని రక్షించింది ప్రభుత్వ అధికారులు కాదంటా... ఓ జేసీబీ డ్రైవర్ రక్షించారట. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ X అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ 9 మంది తమను కాపాడాలని విన్నవించుకున్నప్పటికీ... వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఎవరు సాహసించలేదు. ప్రభుత్వ సహాయక బృందాలు కూడా ఏం చేయలేకపోయాయి. దీంతో.. ఆదివారం రాత్రి 10 గంటలు దాటిన తరువాత కాస్త వరద ప్రవాహం తగ్గడంతో.. స్థానికంగా ఉండే జేసీబీ డ్రైవర్ వెళ్లి వారిని రక్షించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఆ జేసీబీ డ్రైవర్ చేసిన సాహసాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram