Jagityal Farmers : జగిత్యాల లో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతుల ధర్నా నిర్వహించారు. కొనుగోలు సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తూ, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మొక్కజొన్న,పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ధర్నా నిర్వహించారు. దీంతో కలెక్టరేట్ ముందు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.