International Kite & Sweet Festival | హైదరబాద్ లో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ | ABP Desam

Continues below advertisement

   సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్‌ లో ఈ ఫెస్టివల్ సాగుతోంది. పతంగుల పండుగలో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి 60 డొమెస్టిక్ కైట్‌ క్లబ్‌ సభ్యులు హాజరయ్యారు. చూడండి ఎంతటి భారీ పతంగులను ఎగురవేస్తున్నారో.కైట్స్ తో పాటు స్వీట్స్ ఫెస్టివల్ కూడా పెట్టింది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్. దేశం నలుమూల నుంచి అదిరిపోయే స్వీట్లు, పిండి వంటలను తయారు చేసి తీసుకువచ్చి ఇక్కడ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. ఉత్తరాఖండ్ స్వీట్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.ఇలాంటి ఓ పతంగుల పండుగను అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. ఓ వైపు రంగు రంగుల గాలి పతంగులు మరో వైపు నోరూరించే రుచులు పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాదీలకు పండగే

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram