శంషాబాద్ లో కౌన్సిలర్ Vs ట్రాఫిక్ ఇన్స్పెక్టర్.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ, మున్సిపల్ కౌన్సిలర్ బూతులు తిట్టుకున్నారు. తోపుడుబండ్ల ను తీసేశారని కోపంతో పోలీస్ స్టేషన్ కు కౌన్సిలర్ సంజయ్ యాదవ్ తన అనుచరులతో చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్, కౌన్సిలర్ మధ్య వాగ్వాదం జరిగింది. సీఐపై ఏసీబీ భాస్కర్ వేములకు కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ తన విధులకు ఆటంకం కలిగించారని ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశారు.